డిఎం హెచ్ ఓచే ఆరోగ్య కేంద్రం తనిఖీ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 07.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చిత్తూరు డిఎం హెచ్ ఓ సుధారాణి మంగళవారం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని లద్ధిగం ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అయితే స్థలం ఇంకా అందుబాటులో లేక పోయిందన్నారు ఈ మేరకు స్థలం కోసం జిల్లా కలెక్టర్కు నివేదిక ఇస్తున్నట్లు వివరించారు స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఉండాల్సిన వైద్యాధికారి సక్రమంగా విధులు కు హాజరు కాలేదని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ సంజీవినిపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని ఇంట్లోంచి ఉచితంగా వైద్యం పొందడానికి ప్రభుత్వం ఈ సంజీవని పథకం రూపొందించింది అన్నారు ఈ మేరకు జిల్లాలో అందరూ సంజీవినిపై శిక్షణ తీసుకున్నారని జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని మోనా ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *