తల్లి పేరు మీద ఉన్న ఇంటిని కుమార్తె పేరు మీద మార్చడానికి 7000 రూపాయలు లంచం డిమాండ్

★ గ్రామంలో బలహీనతలు తెలుసుకొని లంచాలకు పాల్పడుతున్న అధికారులు

పయనించే సూర్యుడు జనవరి 7 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య :మొలంగూర్ గ్రామంలో తల్లి పేరు మీద ఉన్నా ఇంటిని కూతురు పేరుమీదా మార్చడానికి గ్రామ కార్యదర్శి పెంట సాంబయ్య ను మధ్యవర్తిత్వం గా పెట్టుకొని 7000 రూపాయలు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు వీరు ఇద్దరు సాంబయ్య ను మధ్యవర్తిత్వం గా పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడుతూ గ్రామ అభివృద్ది కి ఆటంకంగా మారినారు వీరి పై ఉన్నత అధికారులు చర్య తీసుకొని ప్రజలకు న్యాయం చేయగలరు లేకుంటే వీళ్ళు చేసిన అక్రమాలు రోజుకొకటీ బయటపెడతం ఈ కార్య క్రమంలో మొలంగుర్ గ్రామ సర్పంచ్ పూదరి రాజు మండల సర్పంచుల సంగం ప్రెసిడెంట్ కోయడ పర్శరాములు వార్డు మెంబర్ శేఖర్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ నల్ల రవీందర్ రెడ్డి ముదిరాజ్ సంగం ప్రెసిడెంట్ గూళ్ళ పాపన్న టీఆర్ఎస్ నాయకులు యూసఫ్ పాల్గొన్నారు