తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు ప్రాణదానం

పయనించే సూర్యుడు జనవరి 07 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:- ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన యమునాబాయి (43) అనే మహిళ తీవ్ర రక్తహీనతతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆమె రక్తగ్రూప్ ఏ పాజిటివ్ కాగా హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 3.8గా ఉండటంతో వైద్యులు అత్యవసరంగా రక్తం అవసరమని సూచించారు దీనికి స్పందించిన నూమాన్ ఖాన్ రక్తదానం చేశారు వారి సహకారంతో బాధితురాలికి అవసరమైన చికిత్స అందించగలిగారు విరితో పాటు బ్రదర్స్ హ్యుమానిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు రహీల్ ఖాన్ నవీన్ ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు రక్తదాతల సేవాభావాన్ని వైద్యులు మరియు రోగి కుటుంబ సభ్యులు అభినందించారు.