తెలంగాణ గ్రామీణ బ్యాంకు అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు జనవరి 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు చింతకాని శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కళాజాత కార్యక్రమం ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకు ద్వారా అందించే వివిధ రకాల రుణాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించి, వ్యక్తిగత సమాచారం ఎవరికి తెలియకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్, బ్యాంకు మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.