తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు

★ రవీంద్ర భారతి లో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ★ ముఖ్య అతిథులుగా డాక్టర్ కేవీ రమణ చారి, రిటైర్డ్ ఐఏఎస్ సారేపల్లి కొండల్ రావు ★ పాల్గొన్న రాష్ట్ర వ్యాప్త అన్ని జిల్లాల జానపద కళాకారులు

పయనించే సూర్యుడు జనవరి 07, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: హైదరాబాద్ లో నేడు జరిగిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సును జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కేవీ రమణ చారి రిటైర్డ్ ఐఏఎస్, సలహా దారులు సారేపల్లి కొండల్ రావు లను ముఖ్య అధితులుగా ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్న ,మహిళా అధ్యక్షురాలు కవిత, జయశ్రీల సమక్షం లో రవీంద్ర భారతి లో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సదస్సు నిర్వహించడం జరిగింది.గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణ చారి రిటైర్డ్ ఐఏఎస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.కళాకారులకు అనుకోని పరిస్థితుల్లో జరిగే విపత్తులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ నిధి అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అన్నారు.ఈ సంక్షేమ నిధి యొక్క ముఖ్య ఉద్యేశం ఏమిటి అంటే ఏదైనా ప్రమాదం జరిగితే, మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఈ సహాయం అందుతున్నారు. ఈ సంక్షేమ నిధి కింద ప్రతీ కళాకారుడు 500 రూపాయలతో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.అలాగే ఒక గుర్తింపు కార్డు ఆగస్టు లో ఇస్తామన్నారు. ఆ కార్డు వల్ల సంఘం లో గౌరవం ,పోలీసు వల్ల గాని , ఆసుపత్రి లో గానీ కళాకారునికి గౌరవం ఉండేలా ఉంటుందన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత ,చట్టబద్ధంగా చేసే కార్యక్రమం చేయాలి అని సూచించారు. కళాకారుల సంక్షేమం కోసం ఎవరైతే కష్ట పడతారో వాళ్లకు రవాణా ఖర్చులు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 33 జిల్లాల కళాకారులకు సుస్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సారేపల్లి కొండల్ రావు మాట్లాడుతూ 500 రూపాయలతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోవడం కళాకారుల యోగా క్షేమాల కోసమే అవసరం పడుతుందన్నారు. కార్యక్రమాన్ని తన భుజాలపై మోస్తూ ,ముప్పై మూడు జిల్లాల కళాకారుల్ని ఏక తాటిపై నడిపిస్తున్న వంగ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ కేవీ రమణ చారి మన సంఘానికి పెద్ద దిక్కు అని, సంఘానికి రెండు కళ్ళ లాంటి కేవీ రమణ చారి, సారేపల్లి కొండల్ రావు అని కొనియాడారు. అలాగే ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదిర నర్సింహులు మాట్లాడుతూ ,రాష్ట్ర స్థాయిలో ఈ సంక్షేమ నిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి కళాకారునికి అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా ఈ మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు రాష్ట్ర అధ్యక్షులకు అధ్యక్షులకు మహబూబ్ నగర్ జిల్లా జానపద కళాకారుల సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త అన్ని జిల్లాల  జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కరుదర్శులు, నియోజక వర్గం అధ్యక్షులు , మిగత జానపద కళాకారులు , తదితరులు పాల్గొన్నారు.