తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థమేడారం జాతర–2026

పయనించే సూర్యుడు. న్యూస్ జనవరి 7 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ. షకీల్) జాతరను విజయవంతంగా నిర్వహించుటకు గాను సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో రీజినల్ మేనేజర్ రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతి రెడ్డి, మరియు సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతర నిర్వహణకు సంబంధించి పాటించవలసిన సూచనలు, భద్రతా నియమాలు, ప్రయాణికులకు కల్పించవలసిన సౌకర్యాలు, అలాగే ఉద్యోగులకు కల్పించవలసిన సదుపాయాలపై విస్తృతంగా వివరించారు. ఈ సమావేశంలో అన్ని కేటగిరీలకు చెందిన అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.