నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

పయనించే సూర్యుడు 7-1-2026 గొల్లపల్లి మండల ప్రతినిధి (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం మంగళవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా రాచకొండ రమేష్ ఉపాధ్యక్షులుగా రాచకొండ చందు కోశాధికారిగా రాచకొండ శ్రీనివాస్ లను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరులకు, పెద్దలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.నా వంతు సంఘానికి సహాయ,సహకారాలు ఉంటాయని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని సంఘంలో ఏ విధమైన సమస్యలు వచ్చినా నేను ముందుండి నడిచి సమస్యలను పరిష్కరిస్తాను అన్నారు. అనంతరం వారికి సంఘ భవనం వద్ద బోరు బావి ప్రహరీ గోడ మంజూరికై సభ్యులతో కలిసి సర్పంచ్ అంజలి గంగాధర్ ఉప సర్పంచ్ మస్కం అంజయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది సర్పంచ్ అంజలి గంగాధర్ ఉప సర్పంచ్ మస్కం అంజయ్య నూతన కమిటీని ఆహ్వానించి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు మరియు సభ్యులకు శాలువ కప్పి సన్మానం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అంజలి మాట్లాడుతూ మీ సమస్యలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విక్రమ్ రాచకొండ రాజయ్య తిరుపతి సాయికిరణ్ లక్ష్మణ్ రాజయ్య సందీప్ రమణ రోహిత్ సుమంత్ వినయ్ వికాస్ ప్రభాకర్ రాజయ్య సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు