పయనించే సూర్యుడు జనవరి 7 (నిర్మల్ జిల్లా) ఖానాపూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో పదో తరగతి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తి చేయడం మరియు విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టి బోధన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై దృష్టి సారించాలని డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.