పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరగబోయే నేపథ్యంలో హబీబ్ సుల్తాన్ అలీ సభ్యుడిగా పోటీ చేయుచున్నారు. ఈ సందర్భంగా ఆయన పలాస జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో న్యాయవాదులను మంగళవారం కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని తోటి న్యాయవాదులను కోరారు. ఆయన న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం కలిగి ఉండి, విశాఖపట్నం బార్ అసోసియేషన్ సభ్యుడిగా సుదీర్ఘ ము గా కొనసాగి హైకోర్టులో మంచి న్యాయవాది గా గుర్తింపు పొందారు.అంతే కాకుండా ఆశ్రా ( అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవేర్నెస్ ) వ్యవస్థాప అధ్యక్షుడిగా పనిచేస్తూ మూడు వేల పైగా కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేశారు. ఈయన సేవల కు మద్దతుగా పలువురు న్యాయవాదులు ఇప్పటికే బార్ అసోసియేషన్ ఎన్నికలులో అయన కు మద్దత్తు ప్రకటించారు. తన గెలుపుకు న్యాయవాదులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.