ప్రజా మలుపు–2026 క్యాలెండర్ ఆవిష్కరణ

★ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నం అనిల్ చేతుల మీదుగా క్యాలెండర్ విడుదల ★ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటానికి ప్రజా మలుపు అంకితభావం

పయనించే సూర్యుడు, కోరుట్ల, జనవరి 07 కోరుట్ల పట్టణంలో ప్రజా మలుపు తెలుగు దినపత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నం అనిల్ మాట్లాడుతూ,ప్రజా మలుపు పత్రిక ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ, పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభంగా వ్యవహరిస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణలో ప్రజా మలుపు పత్రిక చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యలు, సామాన్యుల గళం, అణగారిన వర్గాల కష్టాలు నిరంతరం పత్రికలో ప్రతిబింబిస్తున్నాయని, నిజాయితీగల జర్నలిజంతో ప్రజా మలుపు ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ప్రజల పక్షాన నిలబడి, నిర్భయంగా పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా మలుపు జిల్లా ప్రతినిధి హుస్సేన్, సీనియర్ రిపోర్టర్ నర్సయ్య, కత్తి రాజ్ శంకర్,మీర్జా ముక్రం బైగ్, శ్రీధర్, సుజాయిత్ అలీ తదితరులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.