
పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,జనవరి, 7:- కాకినాడ జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తంగా కన్స్ట్రక్షన్ పని జరుగుతుందంటే దానికి కావలసిన అతి ముఖ్యమైన మెటీరియల్ ప్రత్తిపాడు నియోజకవర్గ నుండే ఆయా ప్రాంతాలకు రవాణా చేయబడుతుంది అంటే అతిశయోక్తి కాదు వ్యాపారస్తులు వాహనదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చుకునే మార్గాలుగా పరిమిత మించి ఎక్కువ లోడు తీసుకు వెళ్తూ సరైనటువంటి భద్రత నియమాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జడ్డింగ్ అన్నవరం, చినశంకర్లపూడి, లంపక లోవ, ఏలేశ్వరం, కొత్త ఎర్రవరం, ప్రత్తిపాడు మీదుగా రోజు వందల సంఖ్య లో ఆరు చక్రాలు, 10 చక్రాలు, 12 చక్రాల, వాహనాలలో 6 ఎం. ఎం, 10 ఎం. ఎం, 20 ఎం. ఎం, 30, 40 ఎం. ఎం, మెటల్స్ ను తరలిస్తూ క్రషర్ ల కు సంబంధించి పెద్ద పెద్ద బండరాళ్ళను సైతం తరలిస్తూ వారి సొంత ప్రయోజనాల కు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లను ధ్వంసం చేయడంతో పాటు ప్రజల ప్రాణాలకు విలువ నీయకుండా రవాణా కొనసాగించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు చూచి చూడనట్టు వ్యవహరించడం పై పలు గ్రామాల ప్రజలు అధికారులు చేతులు తడుపుకోవడంపై ఉన్న శ్రద్ధ భద్రతా ఉల్లంఘన పై కఠినమైన చర్యలు తీసుకోవడంలో చూపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిమితికి మించి రవాణా చేస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సరైన బట్టి భద్రత నియమాలు పాటించేలా ఆంక్షలు విధించాలని ఆయా గ్రామాలు ప్రజలు కోరుకుంటున్నారు