ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు దృష్టికి తీసుకురావాలి

★ ఆశ డే కార్యక్రమంలో సర్పంచ్ కిలారు మనోహర్ బాబు

పయనించే సూర్యుడు జనవరి 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నాడు సర్పంచ్ కీలార్ మనోహర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ఆశ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆశా కార్యకర్తలతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను పరిశీలించిన సర్పంచ్ ఆరోగ్య కేంద్రంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని సూచించారు. సిబ్బందికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. మండల కేంద్ర ఆస్పత్రి అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి త్వరలో అంబులెన్స్ సౌకర్యం మరియు 30 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యేలా పనిచేయాలని సిబ్బందిని ఆయన కోరారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ ఆల్తాఫ్ తో పాటు వైద్య సిబ్బంది సర్పంచ్ మనోహర్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే మండలంలోని ఆశా కార్యకర్తలు కూడా సర్పంచును ఘనంగా సన్మానించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను సందర్శించి సర్పంచ్ వైద్య సేవలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వీరేందర్, కృష్ణారావు, సిరాజ్, సిబ్బంది పద్మ, జయమ్మ, సుజాత, హేమలత, రాజమ్మ, శ్రీను, పల్లవి తదితరులు పాల్గొన్నారు