బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం

★ వినతి పత్రం అందజేస్తున్న ఎడపల్లి సర్పంచ్ కందకట్ల రాంచందర్

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 7 బోధన్ : ఎడపల్లి బస్టాండ్ లోకి బస్సుల రాకపోకలు కొనసాగించాలి. అని సర్పంచ్ కంధకంట్ల రాంచందర్. మంగళవారం ఎడుపల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ లోకి ప్రయాణికుల రవాణా సౌకర్యం కొరకు బస్సుల రాకపోకలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ కందగట్ల రాంచందర్ బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథం కి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతూ బస్టాండ్ లోకి ప్రయాణికుల రవాణా సౌకర్యం కొరకు నిత్యం బస్సుల రాకపోకలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ ఉన్నారు.