
పయనించే సూర్యుడు జనవరి 7 బోధన్ :బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహించే స్థానిక మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మంగళవారం రోజున జిల్లా బిజెపి అధ్యక్షులు దినేష్ కులాచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఎంపిఆర్, కార్యాల యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖ్య సమీక్ష సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ ఇటీవలే పంచాయతీ ఎన్నికలో పార్టీ సాధించిన విజయంతో ఉత్సవంగా ఉండి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసే బిజెపి నాయకులు కార్యకర్తలు దృఢ సంకల్పంతో కలిగి ఉండి బోధన్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని తెలియజేశారు. స్థానిక ప్రజలు కమలం పువ్వు వైపు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎన్నికల దృష్ట్యా పై పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకొని మున్సిపల్ ఏన్నికలో విజయం సాధించుటకు సమిష్టి కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు మేయర్ పదవిని కూడా బిజెపి కైవసం చేసుకుంటుందని పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం అనంతరం బిజెపి పట్టణ శాఖ నాయకులకు దినేష్ కులాచారికి. శాలువ పుష్పగుచ్చం తో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కందగట్ల రామచందర్, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీకాంత్,బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపురం అరవింద్, సీనియర్ నాయకులు సింది విజయ్, హన్మండ్లు చారి,గుంత గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షులు గాదె సందీప్, రవీందర్ , పట్టణ కార్యదర్శి గంగుల శ్రీకాంత్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఏనుగంటి గౌతం గౌడ్, దళిత మోర్చ అధ్యక్షుడు కృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏశాల సూరి, బీజేవైఎం నాయకులు ధ్యాకం శ్రీకాంత్ , ఫణి పార్టీ కార్యకర్తలు తలుదితరులు పాల్గొన్నారు,