భిక్షపతి యాదవ్ జన్మదిన సందర్భంగా గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు, జనవరి 07 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ జన్మదినం సందర్భంగా మియా పూర్ డివిజన్ కు చెందిన బిజెపి సీనియ ర్ నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మియాపూర్లోని వివేకా నంద సేవా సంఘం వారు నిర్వహిస్తున్న ఓం సాయి వృద్ధాశ్రమం లో ని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజ కవర్గానికి బిక్షపతి యాదవ్ చేసిన సేవలు మరువలేనివి, అలాంటి గొప్పవ్యక్తి పుట్టిన రోజు సంద ర్భంగా మా వంతు సాయంగా ఈ అన్న దానం చేయడం ఆదర్శంగా భావిస్తున్నట్లు అయన తెలిపాడు.ఇలాంటి పుట్టిన రోజు వేడు కలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు పేర్కొ న్నారు.అంతకు ముందు మసీద్ బండలోని బిజెపి కార్యాలయంలో కాంటెస్టేడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యా దవ్ తో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ సీనియర్ నాయకులు రాఘవేంద్ర రావు, జాజేరావు శ్రీను, కొంచె శివరాజ్ ముదిరాజ్, రాము, శేఖర్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.