భీంగల్ మండలంలో మినీ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్

పయనించే సూర్యుడు 07 జనవరి 2026 , భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో మంగళవారం రోజున కొండ ప్రకాశ్ గౌడ్ స్మారక సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను కృషి హై స్కూల్ ప్రక్కనగల క్రీడా మైదానంలో కొండా ప్రకాష్ గౌడ్ తనయుడు కొండా రామా గౌడ్ చేతులమీదుగా ఆరంభించారు. ఎస్ఎస్ నగర్ తండా వర్సెస్ శ్రీరామ్ యూత్ తలపడగా భీంగల్ పట్టణానికి చెందిన శ్రీరామ్ యూత్ క్రికెట్ జట్టు విజేతగా నిలిచింది. ప్రముఖ యువ క్రికెటర్ కంకణాల వంశీకృష్ణ "మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్" దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో కొండ రామా గౌడ్ ,నిర్వాహకులు నిచ్చెమోల్ల రాజేశ్వర్, కొండల్, తీగల బాలకిషన్, రఘు, ఉడుత మహేశ్, చేపూర్ రాజు, తోపారం సురేందర్, రేగుళ్ల అరుణ్ కుమార్ తో పాటు శ్రీరామ్ యూత్ క్రికెట్ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు.