మహిళా సంఘాల రుణబకాయిదారులపై రెవెన్యూ రికవరీ చట్టంస్త్రీనిధి మేనేజర్ విక్రమ్ కుమార్

★ అప్పు కట్టకపోతే ఆస్తులు జప్తు సంఘ సభ్యులు బాధ్యులే

పయనించే సూర్యుడు జనవరి 7 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ స్త్రీనిధి రుణబకాయిదారులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనట్లు స్త్రీనిది మేనేజర్ విక్రమ్ కుమార్ తెలిపారు. మంగళవారం బిజినేపల్లి మండల మహిళ సమాఖ్యలో రెవెన్యూ రికవరీ చట్టం పై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మహిళా సంఘాలలో కొందరు సభ్యుల అనాలోచిత చర్యల కారణంగా మొండి బకాయిలు పేరుకు పోతున్నాయని దీని కారణంగా అర్హులైన ఎందరో సభ్యులు రుణం పొందలేని స్థితిలో ఉన్నారని ఇలాంటి సభ్యులపై రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి రికవరీ జరిపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా మొండి బకాయిదారుల ఆస్తులు జప్తు చేసి రుణానికి జమ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఒకవేళ సంఘ సభ్యురాలికి ఎలాంటి ఆస్తులు లేని పక్షంలో సంఘం బాధ్యులుగా ఉంటుందని ఇతర సభ్యులు బకాయి చెల్లింపు జరపవలసి వస్తుందని తెలిపారు. సంఘంలోని సభ్యులు పరస్పరం అవగాహన కల్పించుకొని బకాయిలు లేకుండా చూసుకోవాలని కోరారు. సెర్ప్ మరియు స్త్రీనిధి అధికారులు గ్రామాలలో రెవెన్యూ రికవరీ చట్టం పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీ , వివో ఏ లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు