ముత్తారం ఉప సర్పంచ్ ని సన్మానించిన జెఎస్ఆర్

పయనించే సూర్యుడు జనవరి 07 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికైన మాట్ల హరి కుమార్(రిపోర్టర్)ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేఎస్ఆర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజా సేవలో ముందుఉండాలని, రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, సమాజంలో జరుగుతున్న వార్తలను ప్రజలకు చేరవేస్తూ నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు..