మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

★ పాలకుర్తి ఎంపీడీవో వి వేదావతి

పయనించేసూర్యుడుజనవరి 7(జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) విలువలు దిగజారుతున్న నేటి సమాజంలో అన్ని సమాజిక వర్గాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజాన్నిరూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పాలకుర్తి మండల అభివృద్ధి అధికారి వి.వేదవతి ప్రశంసించారు ఉపాధ్యాయులు తల్చుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాడంలో ముందుంటారనికొనియాడారు. ఈ సందర్భంగా వారు వృత్తి నిబద్దత-సామాజిక బాధ్యత తో ముందుకు సాగుతున్న డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను, డైరీ లను మండల విద్యాశాఖాధికారి పోతుగంటి నర్సయ్యతో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షలు ఎండిశరీఫ్ మండల అధ్యక్షలు చిదురాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దేవగిరి సూర్యప్రకాష్ మండల బాధ్యుల కమలాకర్, అశోక్, మెహరున్నిసా విజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు