రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక ప్రదర్శనకు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 40 మంది ప్రతినిధులు

పయనించే సూర్యుడు జనవరి 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఇన్స్పైర్ అవార్డు ఎగ్జిబిషన్‌లలో పాల్గొనేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ రోజు బయలుదేరి వెళ్లారు. జిల్లా నుంచి సీనియర్ విభాగంలో 7 మంది, జూనియర్ విభాగంలో 7 మంది, ఇన్స్పైర్ విభాగంలో 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అదనంగా సైన్స్ సెమినార్‌లో ఒక విద్యార్థి, టీచర్ టిఎల్‌ఎం విభాగంలో ఒక ఉపాధ్యాయుడు పాల్గొననున్నారు. ఈ విధంగా మొత్తం 25 మంది విద్యార్థులు, వారితో పాటు 15 మంది గైడ్ ఉపాధ్యాయులు కలిపి మొత్తం 40 మంది రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ మండలాల పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థులు, గైడ్ ఉపాధ్యాయులు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు నాయకత్వంలో ఈ రోజు కామారెడ్డి జిల్లాకు బయలుదేరారు. ఈ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు బిజినపల్లి మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల కారుకొండ విద్యార్థిని వైష్ణవి (6వ తరగతి), “సుస్థిర వ్యవసాయ అభివృద్ధి” అనే అంశంపై తన ప్రదర్శనను ప్రవేశపెట్టేందుకు వెళ్లింది.