పయనిచ్చే సూర్యుడు జనవరి 7(జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)దేవరుప్పుల మండలకేంద్రానికి చెందిన శివరాత్రి రాజు తన ద్విచక్ర వాహనాన్ని సాయంత్రం ఇంటిముందు పార్క్ చేసి ఉదయం లేచి చూసేసరికి ద్విచక్ర వాహనం కనిపించలేదు. అదే గ్రామానికి చెందిన రెడ్డి రాజుల కొండయ్య గత మూడు నెలల నుండి హైదరాబాద్ లో జీవనోపాధి కోసం ఉంటున్నాడు.సోమవారం ఉదయం తొమ్మిదిగంటలకు వచ్చి చూసుకునేసరికి అతని ఇంటి గేటు తాళం,ఇంటి డోర్ తాళం పగలగొట్టి కనిపించాయి.అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లేసరికి బీరువా కూడా పగలగొట్టి అందులో ఉన్న వెండిని(సుమారు రూ.12,500)గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని తెలిపాడు.బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఊర సృజన్ కుమార్ తెలిపారు