
పయనించే సూర్యుడు జనవరి 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వన్ మంత్ – వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా నాలుగవ పర్యటనను తిమ్మాయపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయం, ఉలవపల్లి లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్. మస్తానయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఇదే గ్రామంలో నిర్వహించిన మూడు పర్యటనల సందర్భంగా స్వీకరించిన రెవెన్యూ సంబంధిత అర్జీలను పూర్తిగా పరిశీలించి, సదరు సమస్యలను పరిష్కరించి, వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసి అందజేశామని తెలిపారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, గ్రామస్థులు తమ సమస్యలను భయపడకుండా నేరుగా అధికారులకు తెలియజేయవచ్చని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వన్ మంత్ . వన్ విలేజ్ .ఫోర్ విజిట్స్ వంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా రూపొందించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు