పయనించే సూర్యుడు జనవరి 07 ఎన్ రజినీకాంత్:- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని భీమదేవరపల్లి, ముల్కనూర్, మల్లారం, కొత్తకొండ గ్రామాలలోని పదవ తరగతి చదువుతున్న 81 మంది విద్యార్థిని, విద్యార్థులకు ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ మంగళవారం పరీక్ష ప్యాడ్లూ పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందిస్తున్నామని, గణితం, సైన్స్ లలో టాలెంట్ టెస్టులు నిర్వహించి ప్రోత్సాహ బహుమతి అందిస్తున్నట్లు తెలిపారు.. విద్యార్థులు బాగా చదివి, ఉన్నత స్థాయిలో జీవించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు..
