పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 7 బోధన్ : విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విద్యుత్ శాఖ డివిజనల్ అసిస్టెంట్ ఇంజనీర్ నగేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ ప్రజా బాట బోధన్ టౌన్ 2 సెక్షన్ లోని సాలురా మరియు హున్సా గ్రామాలలో మంగళవారం విద్యుత్ వినియోగదారులు ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. భద్రత సూత్రాల కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రజలు, రైతులు విద్యుత్ సమస్యలు తెలుసుకుని కొన్నింటిని సత్వరం పరిష్కరించి తెలవని వాటికి అవసరమైన సామాగ్రి కొరకు అంచనాలు, ఎస్టిమేషన్లు తయారు చేసి త్వరలో పరిష్కరించి విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రజా బాట కార్యక్రమం వారంలో 3 రోజులు మంగళ, గురు, శనివారం గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.ప్రజలు,రైతులు విద్యుత్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ విద్యుత్ వినియోగదారులు, రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను మరియు విద్యుత్ పొదుపు గురించి కెపాసిటర్లు అమర్చడం వలన కలిగే లాభాలను తెలియపరుస్తున్నారు.వంగిన స్తంభాలు, తక్కువ ఎత్తు ఉన్న ట్రాన్స్ఫార్మర్ గద్దెలు మరియు విరిగిన స్తంభాలు, చెట్టుకొమ్మలు తగలడం వంటి వివరాలు తెలియజేసినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని తెలియపరిచారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిన వాటిని విద్యుత్ శాఖ వాహనాలలోనే తరలించి మరమ్మతులు చేయించి తిరుగి ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేసిన వెంబడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ 2 ఏఈ కళ్యాణ్, సబ్ ఇంజనీర్ ఓం ప్రకాష్, లైన్ ఇన్స్పెక్టర్ గంగా కిషన్, అసిస్టెంట్ లైన్మెన్ శాంతి ప్రకాష్, భరత్, సాలూర మరియు హున్సా గ్రామాల సర్పంచ్ లు, విద్యుత్ వినియోగదారులు, రైతులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.