శత వసంతాల ముగింపు సభను జయప్రదం చేయండి

★ ప్రచార జాతా లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే షాబీర్ పాషా ★ లక్షల మందితో ఖమ్మం లో సిపిఐ శత వసంతాల ముగింపు సభ ★ అశ్వారావుపేట శతాబ్దాలుగా పోరాటాల పురుటుగడ్డ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు ముగించుకొని 101 సంవత్సరం లోకి అడుగు పెట్టిన సందర్భంగా ఖమ్మం లో లక్షల మందితో జనవరి 18 న సిపిఐ శత వసంతాల ముగింపు సభను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచార జాతా మధ్యాహ్నం అశ్వారావుపేట కు చేరుకుంది. ప్రచార జాతను సిపిఐ నియోజకవర్గ కార్యాలయం నుండి మొదలుపెట్టి బైక్ ర్యాలీగా తిరుగుతూ జాతను ఆపి ప్రసంగించడం జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా మాట్లాడుతూ జనవరి 18న జరిగే సిపిఐ శత వసంతాల ముగింపు సభను జయప్రదం చేయటానికి అశ్వారావుపేట నుండి వేల సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా అశ్వారావుపేట సిపిఐ పోరాటాల పురిటి గడ్డ అనీ, ఎంతోమంది పేద, గిరిజన ప్రజలకు పోడు భూములు, ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఇక్కడ సిపిఐ పార్టీకి ఉందని ఆయన అన్నారు. అశ్వారావుపేటలో సిపిఐ పార్టీ నీ అనగదొక్కాలని కొందరు రాజకీయ నాయకులు కుటిల రాజకీయ కుట్రలు చేస్తున్న సరే వాటన్నిటినీ దీటుగా ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారు అన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించుకున్న పేదవారి ఇళ్లను కూల్చేసిన తరుణంలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు హామీ ఇచ్చిన విధంగా కూల్చేసిన వారికి ఇళ్ల స్థలాలు ఇస్తూ, ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా సిపిఐ శతవసంతాల ముగింపు సభను జయప్రదం చేయడానికి మండల, పట్టణ పార్టీ తమ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. అంతకుముందు సిపిఐ నియోజకవర్గం కార్యాలయంలో జరిగిన సిపిఐ మండల,పట్టణ జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే సిపిఐ శత వసంతాల ముగింపు సభకు అశ్వారావుపేటనుండి అధిక సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరుకావాలని అన్నారు. అదేవిధంగా మారుతున్న రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా మనం కూడా మారాలని, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించి పార్టీని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథ, కల్లూరు వెంకటేశ్వరరావు,మున్నా లక్ష్మీ కుమారి, సిపిఐ మండల ఇంచార్జ్ గనిన రామకృష్ణ, కార్యదర్శి వగ్గెల అర్జునరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్, సహాయ కార్యదర్శిలు సయ్యద్ జాకీర్,జక్కం బలరాం, ప్రజా సంఘాల నాయకులు పటాన్ జలాల్, చీపుర్ల సత్యవతి, ముత్తు,చెన్నారావు, సిపిఐ నాయకులు చిన్నోడు,రవి, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, బుచప్ప, గోపి,వెంకమ్మ,రాంబాబు,జిన్నయ్య,పోలయ్య సిపిఐ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు