పయనించే సూర్యుడు, జనవరి 7: రంగారెడ్డిజిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) కొండాపూర్ శ్రీ రామ్ నగర్ బ్రాంచి కి చెందిన శ్రీనిధి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో జరిగిన ఎస్.ఓ.ఎఫ్ ఐ.ఈ.ఓ పరీక్షలో అనేకమంది విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. అందులో భాగంగా వారు బంగారు పతకాలను పొందారు. దీక్షిత కొమెరా,అద్వైత్ శ్రీయాన్ పప్పు, స్కంద భార్గవ్ చాటకొండ, వాణిశ్రీ నంద, అనిక చౌరాసియా, సి.హెచ్. ఆయాన్ష్, తేజల్ గుజ్జారి, సాన్వి శ్వేతాబ్, సాయి సాత్విక్ దంగేటి, వైష్ణవి గ్రంధి, చేతన్ ప్రజ్వల్, శ్రీరామ్ రెడ్డి గోలి, ఈ విద్యార్థులు బంగారు పథకాలు పొందినందుకు పాఠశాల యాజమాన్యం పాఠశాల ప్రిన్సిపల్ సుధా విద్యార్ధిని,విద్యార్థులు మెరిట్ లో సాధించిన బంగారు పతకాల పట్ల హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. ఇలాగే ఇంకా అందరూ విద్యార్థిని, విద్యార్థులు బాగా చదివి వారి ప్రతిభను చాటాలని వారిని వెన్ను తట్టిప్రోత్సహించారు.