సమాజంలో మార్పు మనతోనే మొదలవ్వాలి – హిందూ సమ్మేళనం

పయనించే సూర్యుడు జనవరి ఆరు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా,,బి‌‌.ఆర్‌.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఉప మండలంలో గెద్దనపల్లి గ్రామంలో కాషాయ శోభతో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమాజమే స్వయంగా నిర్వహించుకున్న ఈ హిందూ సమ్మేళనంలో కాకర్లపూడి ప్రతాప్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిథిగా విచ్చేసిన శృంగవృక్షం దత్త పీఠాధిపతి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతీ స్వామిజీ మాట్లాడుతూ నేటి సమాజం భక్తితోపాటుగా ధర్మ ఆచరణ ధర్మ రక్షణ మీద కూడా దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రధాన వక్తగా బి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సమాజంలో అత్యవసరమైన సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, హిందూ కుటుంబ వ్యవస్థ, స్వదేశీ, పౌర విధులు వంటి ఐదు విషయాల్లో పరివర్తన కోసం సమాజమంతా కృషి చెయ్యాలని, సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు అలవాటు చేయాలని. సామాజిక సమరసత హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన అంశం, కావున మనం కుల, ప్రాంత, ఆర్ధిక తారతమ్యాలు విడిచి కృషి చేసి భారత మాతను విశ్వ గురువుగా నిలుపుకుందాం అని పిలుపునిచ్చారు. చి,,గొలకోటి సంస్కృతి నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటుంది. కార్యక్రమ అనంతరం స్థానికి కులవృత్తులు వారిని స్వామీజీ చేతుల మీదుగా ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దంతులూరి సీతారామకృష్ణంరాజు గ్రంధి నానాజీ ఆకొండి మహేష్ కొప్పిశెట్టి మల్లికార్జున రావు పెన్మెత్స గోపాల కృష్ణం రాజు గొలకోటి వెంకట రెడ్డి ఇందుకూరి సూరిబాబు మల్లాడి రాధాకృష్ణ చెరుకు రామకృష్ణ కెటివి చిన్నబ్బాయి సినీనటులు పుష్పా సురేష్ బొంతు కనకారావు ఏలూరి రాంబాబు సలాది శ్రీనివాస రావు నంద్యాల నరసింహ స్వామి మట్టా సూరిబాబు మట్టా శివకుమార్ సత్తిబాబు రాజు సత్యవాడ సతీష్ మరియు అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు.