సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 7 పెనుగంచిప్రోలు మండలం, వెంకటాపురం గ్రామంలో ఉన్న శ్రీ హనుమత్ సమేత కోదండ రామాలయంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ముందుగా ఆలయంలో దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహించి భక్తులతో కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి భావనను పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతను బలపరుస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధితో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడుకోవడం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.