సొంత ఖర్చులతో సోలార్ లైట్ ఏర్పాటు

★ ఎలక్షన్ లో ఇచ్చిన మాట నెరవేర్చిన వార్డు మెంబర్ ఎదునూరి శ్రీధర్

పయనించే సూర్యుడు జనవరి 07 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో సొంత ఖర్చులతో 600 వాట్స్ సోలార్ వీధి దీపాన్ని 3వ వార్డ్ మెంబర్ ఏదునూరి శ్రీధర్ ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం నెలరోజుల లోపే సోలార్ విధి దీపాన్ని పోచమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం నిత్యం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు..