హెల్త్ క్యాంపును పర్యవేక్షించిన బిజెపి జనసేన నాయకులు

పయనించేసూర్యుడు జనవరి 7 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు శంకర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో పట్టణ పేదరిక నిర్మూలన మరియు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సఖి సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మెప్మా పిడి శ్రీనివాసులతో కలిసి 35వ మున్సిపల్ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ,జనసేన సీనియర్ నాయకుడు పులిరాజు పర్యవేక్షణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కౌన్సిలర్ లలితమ్మ,జనసేన నాయకులు పులిరాజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పేద బడుగు బలహీన వర్గాల మహిళల ఆరోగ్యాలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సఖిసురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచి కార్యక్రమమని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి మహిలతో పాటుగా 35సంవత్సరాలు పైబడిన మహిళలంతా ఉపయోగించుకోవాలని సూచించారు.ఎందుకంటే మహిళలకు సంబంధించిన పదహారు రకాల రోగాలకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 5లక్షల రూపాయల వరకు కేటాయించి మెరుగైన చికిత్సలు అంద చేయడం జరిగుతుందని, ఇది పేద బడుగు బలహీన వర్గాల మహిళలందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మహిళా సాధికారతను తెలియచేస్తున్నదని లలితమ్మ, పులిరాజు తెలిపారు.ఇంత గొప్ప కార్యక్రమాన్ని వ్యహ రచన చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో బిజెపి మహిళా నాయకురాళ్ళు బిజెపి పట్టణ ఉపాధ్యక్షురాలు వినీతాగుప్త , సౌత్ జోన్ బిజెపి అధ్యక్షురాలు ఉషారాణి, మార్కెట్ యార్డు డైరెక్టర్ పిఎస్ జయరామ్, వెంకటేష్ మెప్మా ఇంచార్జీ వీరారెడ్డి, మెప్మా టిఎల్ ఎఫ్ ఆర్పీలు సుశీలమ్మ, లీలావతమ్మ మరియు పెద్ద ఎత్తున ఆర్పీలు, మహిళలు పాల్గొనడం జరిగింది..