
పయనించే సూర్యుడు న్యూస్ 07-01-2026 శిరధారణం వాహనదారులకు ప్రాణ రక్షా అని మెదక్ రూరల్ సీఐ జార్జ్ అన్నారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళవారం పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తో కలిసినార్సింగి చౌరస్తా వద్ద వాహనదారులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జార్జ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్టు ఉపయోగించక పోవడం వల్ల జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి వాహనదారుడు ప్రతి పౌరుడు బాధ్యతగావ్యవహరించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చునని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రాంగ్ రూట్లో నడపకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, పోలీసు సిబ్బంది, వాహన చోదకులు, ఆటో డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు