
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 రాజన్న సిరిసిల్ల జిల్లా(స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ. షకీల్) దేవయ్య కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని,26 సంవత్సరాలు పోలీస్ శాఖలో విధులు నిర్వహించిన దేవయ్య మరణం తీరని లోటుని జిల్లా ఎస్పీ తెలియజేశారు.సోమవారం రోజున విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలోని క్రషర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన దేవయ్య అంతః క్రియలలో పాల్గొని దేవయ్య పార్తివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. స్వర్గస్తులైన దేవయ్య కు భార్య,నాలుగురు పిల్లలు ఉన్నారు.పోలీసు వ్యవస్థకు హోం గార్డ్ దేవయ్య మరణం తీరని లోటుని, బాధిత కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు నాగేశ్వరరావు, రవి, మొగిలి, ఆర్.ఐ కు మధుకర్,యాదగిరి, రమేష్, ఎస్.ఐ ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.