పయనించే సూర్యుడు,జనవరి 7, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. 36 సంవత్సరాల కాంగ్రెస్ రాజకీయం, మండల ప్రధాన కార్యదర్శిగా పదవి. భార్య మాజీ ఎంపీటీసీ పార్టీలో అనేక పదవులు తీరా రిజర్వేషన్ కలిసి వస్తే టికెట్లు నిరాకరణ ఇది బచ్చన్నపేట మండల కేంద్రంలోని అల్వాల ఎల్లయ్య పరిస్థితి. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదన్న చందంగా రిజర్వేషన్ కలిసి వచ్చిన పార్టీ మాత్రం టికెట్ ఇవ్వలేదు. టికెట్ నామినేషన్ ముందు రోజు వరకు కూడా తనదే అంటూ నమ్మించి గొంతుకోసారని అందుకే కన్నతల్లి వంటి కాంగ్రెస్ పార్టీని విడిచి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పత్రిక ముఖంగా తెలియజేశారు. మండలంలో మొన్నటి స్థానిక ఎలక్షన్ల వరకు కూడా తాను మండల ప్రధాన కార్యదర్శిగా కొనసాగాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నానని మాజీ ఎంపీటీసీ భర్త అల్వాల ఎల్లయ్య అన్నారు. పార్టీ ఎదుగుదలకు అహర్నిశలు కృషి చేశానని ఆయిన దళితడిని ఐనందునే తనను ఎదగనివ్వకుండా కొత్తగా ఇంకోరిని తీసుకువచ్చి అ ఆ లు నేర్పుతున్నారని, అంతా వారి స్వలాభం కోసమే చూసుకుంటున్నారు తప్ప పార్టీని పక్కన పెడుతున్నారని మొన్న జరిగిన మండలంలోని సర్పంచ్ ఎన్నికలే దానికి నిదర్శనమని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 సర్పంచ్ స్థానాలు 26 కు బదులుగా వచ్చాయంటే పార్టీ ఏ తీరుగా గాయపడిందో, బ్రష్టుపడుతుందో పెద్దలు ఆలోచించాలని వారు తెలిపారు.