పయనించే సూర్యుడు : జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతులకు కావలసిన యూరియాను అందు బాటులో ఉంచామని కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారి బి మృదుల పేర్కొన్నారు, మండల వ్యవసాయాధికారి బి మృదుల, తహసీల్దార్ రవి కిరణ్,సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో కాట్రేనికోన రైతు సేవా కేంద్రం నందు రబీ సాగుకు ప్రణాళికగా యూరియాను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి బి మృదుల మాట్లాడుతూ కాట్రేనికొన మండల పరిధిలో 60 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. కాట్రేనికోన, చెయ్యేరు, పల్లంకుర్రు, కందికుప్ప సొసైటీలలో యూరియా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. గ్రామలలో కమిషన్ దారులు అధిక ధరలకు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి సడా డైరెక్టర్ విత్తనాల బుజ్జి, సొసైటీ కార్యదర్శి శంకర్, రైతులు సంగాని మునీంద్రా,గుబ్బల చంద్రరావు, కంచర్ల రామకృష్ణ, శీలం సూర్యనారాయణ, కాట్రేనికొన గ్రామ వ్యవసాయ సహాయకులు మనోజ్, దేవేంద్ర, సుధ తదితరులు పాల్గొన్నారు.