
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 08: నియోజకవర్గం రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని కాంగ్రెస్ నాయకుల సంబరాలు. అభివృద్ధి ప్రధాత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం పట్ల హర్షం మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాత ప్రముఖ వైద్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమించడాన్ని హర్షిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ ఎంపీపీలు వెంకట రమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, టిపిసిసి కోఆర్డినేటర్ రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి,మాజీ ఫ్యాక్స్ చైర్మన్ ఐరెడ్డి మహేందర్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ ,అధికార ప్రతినిధి పసువుల వెంకన్న, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రాజేశం, తో పాటుగాఏఎంసి వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు తీగల పుష్పలత గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు జ్యోతి,అంతగిరి ఆలయ చైర్మన్ కొలపురి అంతగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వీరేశం ఆయా గ్రామాల సర్పంచులు మామిడి రాజు, భూమయ్య, చంద్రారెడ్డి, విజయ్ గౌడ్, వెంకట్రాంరెడ్డి, ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.