పయనించేసూర్యుడు జనవరి 8 ఆదోని డివిజన్ ఇంచార్జి గుమ్మల బాలస్వామి: మంచి కార్యానికి మనసుంటే చాలు, సాయం తానై వస్తుంది.సరస్వతి దేవి ఆలయం మరియు రుద్రానంద సరస్వతి దేవి మఠం అభివృద్ధి పనుల కోసం ఆలయ కమిటీ సభ్యులు బుధవారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసే ఆది కృష్ణమను కలుసుకోవడం జరిగింది. ఆలయ అభివృద్ధిపై వారు చూపిస్తున్న తపనను చూసి చలించిన ఆమె, అమ్మవారి సేవ కోసం ఎంతో ప్రేమతో పదివేల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ ఆత్మీయ కలయికలో రేణు వర్మ ,మాజీ ఎంపీపీ మురళి , సాదిక్ వలి తదితరులు పాల్గొన్నారు. తమ విన్నపాన్ని మన్నించి, ఆలయ పురోగతికి తోడ్పాటు అందించిన ఆది కృష్ణమ్మకు కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.