అశ్వాపురం ఎక్స్ లెంట్ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం.

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 8: హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగితే తన అజాగ్రత్త వల్ల కుటుంబం రోడ్డున పడుతుంది అంటే ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి రోడ్డు నియమాలను తప్పక పాటించాలని ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి అని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమర్ ఫారూఖ్ అన్నారు.జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు - 2026 సందర్భంగా ఆర్టిఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం అశ్వాపురంలోని ఎక్స్ లెంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రత ముఖ్యంశాలు వివరించారు. విద్యార్థులు పాఠశాల బస్సులను, వాహనాలను ఎక్కేటప్పుడు,దిగేటప్పుడు,రోడ్డు దాటేటప్పుడు వాహనాలను చూసుకొని దాటాలని, ప్రయాణంలో కూడా ఏ వాహనం ఎక్కిన దిగిన చూసుకోవాలని మీ తల్లిదండ్రుల చేయి విడవకూడదని అన్నారు అదేవిధంగా మీ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనల పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలని వారికి మీరు చదువుతున్న పుస్తకాలలోని భద్రత సూచికలను చూపించాలని, కార్లు లో మరియు ఇతర వాహనాలు ప్రయాణించడం సీటు బెల్ట్ పెట్టుకోవడం అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కూడా చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లెనిన్ విజయ్ కుమార్,అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, సిబంది,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.