ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రికతో ఇస్తున్న పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చల్లా బాబు రెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 08.01.2026 అన్నమయ్య జిల్లా మదనపల్లె పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) గత ప్రభుత్వంలో రైతుల సొంత పట్టాదారు పుస్తకాలపై గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించి రైతులకు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చిన మీ భూమి _ మీ హక్కు అనే కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గo పులిచెర్ల మండలం ఎల్లంకి వారి పల్లి నందు నిర్వహించిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబురెడ్డి)
ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎంఆర్ఓ మరియు రెవెన్యూ సిబ్బంది మండల స్థాయి అధికారులు రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చల్లా బాబురెడ్డి గారు మాట్లాడు తూ గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాల విషయంలో మరియు రీ సర్వేలో జరిగిన లోపాలను గురించి వివరించి ప్రతి రైతుకు అన్యాయం జరగకుండా సుపరిపాలన ను అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు వారి ఆనందాన్ని మాటలు రూపంలో వ్యక్తం చేయడం జరిగింది.