ఆర్ఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో వితరణ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 8 జగయ్యపేట పట్టణంలోని ఈరోజు ఆర్ఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న కృష్ణ వికాస్ మహిళా సొసైటీ వృద్ధాశ్రమ నందు వృద్ధులకు ఫౌండేషన్ నిర్వాహకులు చారుగుండ్ల కొండ , పోలంపల్లి రాధా ల ఆధ్వర్యంలో రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు పిండి వంటకాలను అరిసెలు సజ్జ బూరెలు కారపూస తదితర తినుబండారాలను సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాస్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కర్లపాటి మాట్లాడుతూ ఆర్ఎంకె టీవీ యాజమాన్యం ఆర్ఎంకె ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి సమాధానాన్ని ఆయన అభినందించారు. సెమీ అర్బన్ ప్రాంతాలలో నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమాలకు ప్రభుత్వం సహకారాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో రమేష్ వృద్ధులకు దుప్పట్లు అందజేయగా అనిల్ 25 కిలోల బియ్యాన్ని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.