ఆలయ నిర్మాణానికి యువ నాయకుడు విరాళం.

పయనించే సూర్యుడు జనవరి 8 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని సరస్వతి దేవి ఆలయ షెడ్డు నిర్మాణం కోసం టిడిపి యువ నాయకులు మారుతీ నాయుడు 25,000 వేల రూ విరాళం అందజేశారు. అరెకల్ రామకృష్ణ, వెంకటేష్ చౌదరి సమక్షంలో ఈ ఆర్థిక సాయాన్ని ఆలయ కమిటీకి అందజేయగా, నిర్వాహకులు రేణు వర్మ మరియు సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.