ఇల్లంతకుంట స్టేషన్ పరిసరాలు,వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు,స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ

పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /08:నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. బుధవారం రోజున వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ పరిసరాలు,వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వివరాలు,స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి,స్టేషన్ భౌగోళిక మ్యాప్ పరిశీలించి క్రైం హాట్స్పాట్స్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెండింగ్ కేసులు,కోర్టు కేసులు,ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు,నేరాల స్థితిగతులపై సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంతో పోలిస్తే నేరాల రేటు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5స్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రతను కాపాడాలని,ఫైళ్లను క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉంచాలని,ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు,సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు.సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని, అసాంఘిక కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై వెంటనే సమాచారం అందించేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని, యువతలో చట్టం పట్ల గౌరవం పెంపొందించేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ, వెంట సి.ఐ మొగిలి, ఎస్.ఐ అశోక్, సిబ్బంది ఉన్నారు.