ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలునిబంధనల ప్రకారం ఇసుక కేటాయించాలికొత్తపల్లి ఇసుక క్వారీని తనిఖీ చేసిన

* జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పయనించే సూర్యుడు జనవరి 8 కరీంనగర్ న్యూస్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలని అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్ఎండి రిజర్వాయర్ జలాల నుండి పూడికతీత పూడిక నుండి ఇసుక వేరు చేసే విధానాన్ని, ఇసుక క్వారీ నిర్వహణను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు దిగువ మానేరు జలాశయంలో 0.3 టీఎంసీల సామర్థ్యంలో పేరుకుపోయిన పూడికను తొలగించే కార్యక్రమంలో భాగంగా ఈమోట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పూడకతీత పనులను చేపట్టింది పూడిక నుండి వచ్చిన ఇసుకను వేరు చేస్తూ టీజీఎండిసి పర్యవేక్షణలో వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్న విధానాన్ని కలెక్టర్ సిపి పరిశీలించారు క్వారీ నుండి ఇసుక లోడింగ్ వేయింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు రికార్డులు వే బిల్లులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట పరిమితికి మించి ఇసుక తరలించినా కేటాయించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాలు క్వారీలోకి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి వాహనం వివరాలు లోడింగ్ పరిమితి వేబిల్లులు వంటివి రికార్డు చేయాలని తెలిపారు నిర్దిష్ట వేళల తర్వాత ఇసుక లోడింగ్ చేయరాదని అన్నారు సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ లోడింగ్ వేయింగ్ సమయంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని అన్నారు సీసీ కెమెరాలు పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని అన్నారు ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక కేటాయింపు ఉండాలని తనిఖీల్లో అక్రమాలు బయటపడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిజిఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి డిఈఈ శ్రీనివాస్ ఏఈఈ సంజన ఏఈ వంశీధర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *