పయనించే సూర్యుడు, జనవరి 8, బచ్చన్నపేట మండలం ప్రతినిధి: నీల పవన్. బుధవారం జనగామ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన కోడూరు శివకుమార్ గౌడ్. కోన్నే గ్రామంలో త్వరలో మినలాపురం హనుమంతరావు పంతులుచే జరగబోయే శ్రీ రుద్ర సహిత శత చండీయాగ మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రావలసిందిగా ఎమ్మెల్యే ని కోరగా,ఇట్టి కార్యక్రమానికి దివి 10/1/ 2026 రోజున జరిగే పూర్ణాహుతి ఆశీర్వచనం మరియు అన్నదాన కార్యక్రమానికి హాజరవుతానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్గసిద్ధి రాములు పాల్గొన్నారు.
