పయనించే సూర్యుడు జనవరి 07హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి శంషాబాద్ లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయి.ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో అనేక రకాల విద్యారంగ మరియు సామాజిక సమస్యల పైన అనేక తీర్మానాలు చేశారు. 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించంగా, హుజరాబాద్ కు చెందిన గోస్కుల అజయ్ ని ఏబీవీపీ రాష్ట్ర ఎస్ఎఫ్ఎ కో-కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను నమ్మి రాష్ట్ర శాఖ లో స్థానం కల్పించి ఏబీవీపీ రాష్ట్ర ఎస్ఎఫ్ఎ కో-కన్వీనర్ గా ఎన్నుకున్న రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే అనునిత్యం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని అజయ్ పేర్కొన్నారు.