ఒక ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడలనుకున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్.

* వారి వద్ద 9mm పిస్టల్,05 రౌండ్స్ స్వాధీనం. * వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

పయనించే సూర్యుడు.న్యూస్ జనవరి 8 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ .షకీల్) ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యలపు గోవర్ధన్ ,జగిత్యాల జిల్లాకు చెందిన మంజరి సురేందర్, అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురి చేయడం,డబ్బు వసూలు చేయడం, భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నరన్న నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అపి తనిఖీ చేయగా వీరి వద్ద ఒక్కటి 9 mm పిస్తోల్ 05 రౌండ్స్ ఉండగా వాటిని స్వాధీన పర్చుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు నిందితుల యొక్క వివరాలు. 1). తోకల శ్రీకాంత్ s/o మల్లేశం, 34 సంవత్సరాలు, కులం: గొల్ల, r/o రామన్నపల్లి v/o తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా (గతంలో నిషేధిత జనశక్తి సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి). 2). దాసరి తిరుపతి s/o రాజయ్య, 43 సంవత్సరాలు, కులం:- తేనుగు, Occ: ఆటో డ్రైవర్, r/o సారంపల్లి v/o తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. 3). వంజరి సురేందర్ @ విశ్వనాథ్ @ బాదం సూర్య ప్రకాష్ రెడ్డి s/o రాజమల్లు, వయస్సు:-57 సంవత్సరాలు, కులం: వంజరి, r/o కుమ్మరిపల్లె v/o వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా (గతంలో నిషేధిత జనశక్తి సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి). 4). పయ్యావుల గోవర్ధన్ s/o ఎల్లయ్య, వయస్సు: – 31 సంవత్సరాలు, r/o పెద్దలింగాపూర్ v/o ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. (గతంలో నిషేధిత జనశక్తి సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తి). ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి, టాస్క్ఫోర్స్ సి.ఐ నటేష్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, ఎస్.ఐ ఉపేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *