కళావేదికను ప్రారంభించిన పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పి- 4 కార్యక్రమంలో భాగంగా పలాస నియోజకవర్గంలో మొదట విద్యావ్యవస్థ నుంచి ప్రారంభించడం చాలా శుభదాయకం అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పి-4 కార్యక్రమంలో భాగంగా రూ.15 లక్షల వ్యయంతో పలాస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన ఆడిటోరియం మరియు కళావేదికలను ఆమె ప్రారంభించారు. ప్రవాసాంధ్రులు, విద్యాదాత, ప్రముఖ సైంటిస్టు డాక్టర్ కణితి హేమాచలం తను చదువుకున్న పాఠశాలకు,ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో కనితి గ్లోబల్ గ్రాండ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కనితి గ్లోబల్ గ్రాంట్స్ సాకారంతో 15 లక్షల రూపాయలు వరకు నిధులను వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ప్రవాసాంధ్రులు వారి స్వగ్రామాల్లో పి-4 కార్యక్రమం కింద అభివృద్ధి పనులు చేపట్టాలని, పేదరిక నిర్మూలనకు సంకల్పించాలని కోరారు. పూర్వ విద్యార్థి హేమాచలం మాట్లాడుతూ ఈ పాఠశాలను సందర్శించడానికి వచ్చేనాటికి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని, ఆడిటోరియం క్రింది భాగంలో గచ్చు చేసి విద్యార్థులు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉండేటట్టు చేస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బాబు రావు, గ్రంథాలయ చైర్మన్ పీరికట్ల విట్టల్ రావు , పలాస -కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ బల్ల గిరిబాబు, కూటమి ముఖ్య నాయుకులు పాఠశాల సిబ్బంది మరియు విషన్ 2047 పలాస నియోజకవర్గం యంగ్ ప్రొఫెషనల్ యు శ్రీనువాసరావు, విషన్ స్టాఫ్ స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.