కుమ్మన్ పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

★ తనిఖీ చేసిన గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 8 బోధన్: సమయాను గుణంగా పిల్లలు మరియు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి అంగన్వాడీలకు సూచించారు. బుధవారం సర్పంచ్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందడం పట్ల గర్భిణీలు మరియు బాలింతలు అంగన్వాడీ టీచర్ లను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పౌష్టిక ఆహారాన్ని సమయానుగుణంగా అందించాలని అంగన్వాడీ సిబ్బందిని కోరారు. అన్ని సక్రమంగా ఉండడం అట్లా సర్పంచ్ అంగన్వాడి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడి పరిసర ప్రాంతాలతో పాటు వంటశాలను సైతం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శుభ్రత పాటించాలని కోరారు. అంగన్వాడి నిర్వహణలో మండలంలోనే ఆదర్శంగా నిలవాలని హితవు చెప్పారు. ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్న తమ దృష్టికి చేర్చినట్లయితే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడంతో పాటు సందేహాల నివృత్తికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి మద్దిలేటి, అంగన్వాడీ టీచర్, ఆయా తదితరులు ఉన్నారు.