క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంపెద్ద పీఠ: అనిల్ కుమార్ యాదవ్

పయనించే సూర్యుడు, జనవరి 08 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) జాతీయ 26 వ ఎస్ క్యూ ఏ వై ఛాంపి యన్స్ గోచిబౌలిలోని బాలయోగి క్రీడా స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయినవి. తెలంగాణ ఎస్ క్యూఏ వై అసోసియేషన్ వారు ఏజీఎస్ ఆఫ్ ఎస్ క్యూఏ వై ఫెడ్రేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో బాల బాలికలు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సా హంగా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ విచ్చిసి విజేతలకు బహుమతులు అందించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీఠ వేసి అవసరమైన ప్రతి అంశంలో కూడా అండగా ఉంటూ ప్రోత్స హిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమలో టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తిక్, యువజన నాయకులు మహేందర్, మహేష్, వినోద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.