గుడ్లనర్వలో అభివృద్ధి సంకల్పం: శివాజీ సేవా సమితికి రూ.5 లక్షల విగ్రహం విరాళం

* విరాళం అందజేసిన మేకల అయ్యప్ప

పయనించే సూర్యుడు జనవరి 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో గ్రామాభివృద్ధి దిశగా ముందడుగు పడింది. ఈ సందర్భంగా మేకల అయ్యప్ప శివాజీ సేవా సమితికి రూ.5 లక్షల విలువైన శివాజీ మహారాజు విగ్రహాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని పాఠశాలను సందర్శించి, విద్యార్థుల సౌకర్యార్థం త్వరలోనే అదనపు గదులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ఉన్న పురాతన శివాలయాన్ని పునరుద్ధరించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా రామాలయ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్, యువత సభ్యులతో కలిసి గ్రామ మధ్యలో అనువైన స్థలాన్ని పరిశీలించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు గ్రామ ప్రజలంతా సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ శివుడు, వార్డు సభ్యులు, ఆర్ మన్యం. లేట్ల భీమారావు. భీమని రాజు. లేట్ల శివకృష్ణ. మరియు మాజీ సర్పంచ్ మహేష్, మాలిక్, మాజీ ఎంపీటీసీ గూడ కాశన్న పాల్గొన్నారు. అలాగే శివాజీ సేవా సమితి సభ్యులు బీమని శాంతికుమార్, రామ్ దాస్, మేకల శ్రీశైలం, మేకల లక్ష్మీకాంత్, మేకల బంగారయ్య, కోట్ల లింగం, కతే పర్వతాలు, భీమ్ సాగర్, కత్తి రాఘవేందర్, రామకృష్ణ, మేకల అఖిలేష్, బీమని రాజు, శివలింగం రాము తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *