పయనించే సూర్యుడు జనవరి 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామపంచాయతీ పరిచయ గ్రామసభ ను ఏర్పాటు చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచి గ్రామంలోని పలు వార్డులలో ఉన్న సమస్యలను వార్డు మెంబర్ల ద్వారా తెలుసుకొని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, వార్డులలో ఉన్న ప్రతి సమస్యను వార్డు మెంబర్లు లేదా గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే కూచికుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీల కూచుకుల దామోదర్ రెడ్డి సహాయంతో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటామని ప్రజల సహకారం ఎల్లవేళలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాగ్యమ్మ ఉపసర్పంచ్ దాసరి శివప్రసాద్ వార్డు మెంబర్లు రామగుల్ల మన్యం లేట్ల శివ కృష్ణ లేట్ల భీమారావు భీమని రాజు వట్టెం శివపార్వతి అంబటి నీలమ్మ అతినారపునీలమ్మ సొప్పరి శివశంకర్ ఎరుకలి చంద్రకళ బుద్ధుల అలివేల అంగన్వాడి టీచర్లు కళావతి ఆశా వర్కర్లు జ్యోతి నాగేశ్వరి ఫీల్ అసిస్టెంట్ రాజు గ్రామపంచాయతీ కారోబార్ కొడిదెల శంకర్ లక్ష్మయ్య శంకర్ గ్రామ మాజీ సర్పంచి భీమన వకటయ్య మాజీ ఎంపిటిసి గూడ కాశన్న గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు